Categories
అన్నం వార్చిన గంజి లో ఉండే ఖనిజాలు పోషకాలు చర్మ సౌందర్యాన్ని వయసు ఛాయలు దగ్గరికి రానివ్వదు అంటున్నారు ఎక్స్పర్ట్స్.బియ్యం గంజి లో తాజా కలబంద గుజ్జు రెండు ఇ-విటమిన్ క్యాప్సూల్స్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి లేపనం లాగా రాసి మృదువుగా మర్దనా చేస్తే చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది దద్దుర్లు మొటిమల నివారణకు పనికి వస్తుంది. కలబందలో వ్యాధి నిరోధక కారకాల కారణంగా ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విటమిన్ చర్మాన్ని తేమగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ లేపనాన్ని పది నిమిషాలు మొహం పై రాసి ఆరనిచ్చి కడిగేస్తే చాలు.