రోడ్డు పక్క టార్పాలిన్ తో వేసిన చిన్న గుడారం లో ఉండే భరతి ఖండేకర్ ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది.వీధి దీపపు వెలుగులో చదువుకున్న ఈ అమ్ములు గురించి ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ బాలికకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలు ఇచ్చారు. ఆడపిల్లగా ఫుట్ పాత్ పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువుకుంటున్న భారతి కి కంప్యూటర్ ఫర్నిచర్ కానుకగా ఇచ్చారు.భవిష్యత్తులో ఆమె చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. భారతి తప్పకుండా ఎంతో అద్భుతమైన భవిష్యత్తును సాధిస్తుంది.