కరోనా నేపథ్యంలో చేతులు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.అలాగే శానిటైజర్ ల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చేతులు తాకకుండా శానిటైజర్ చేసుకునే యంత్రాన్ని రూపొందించింది రచన దవే తమిళనాడు కల్పక్కం లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పని చేసిన రచన అనా రోగ్యాలతో పట్టిపీడించే వైరస్ ల పైన పరిశోధనలు చేశారు ఆమె స్థాపించిన సంస్థ ‘మైక్రో గో’ ఆమె కనిపెట్టిన హ్యాండ్ శానిటైజర్ డివైస్ తో చేతులు 6 స్థాయిల్లో శుభ్రం అవుతాయి అప్పటివరకూ ఉన్న వైరస్లు తొలిగిపోతాయి.హైదరాబాద్ తో సహా 22 నగరాల్లోని విమానాశ్రయాల్లో ఈ డివైస్ లు ఏర్పాటు చేశారు.