Categories
ఈ చల్లని వాతావరణంలో ఇంట్లో దుర్వాసనలు వస్తూ ఉంటాయి.సాధారణంగా చెత్త బుట్ట నుంచే ఇలాంటి వాసనలు రావచ్చు.తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా ఉంచితే వాసనలు రావు.చాలామందికి ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి.సోఫాలు, మంచాల పైన అంటుకున్న జంతువు వెంట్రుకలను వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.అలాగే తడిసిన దుస్తులు కూడా వాసన వేస్తాయి.మాసిన దుస్తులు తడవకుండా బాస్కెట్ లో వేసి దూరంగా పెట్టాలి.ఉతికిన బట్టలు ఎండలో ఆరవేయాలి లేదా గాలి వచ్చే చోట ఆరే వరకు ఉంచాలి.వారానికి ఒక్కసారి పక్క పైన దుప్పట్ల దిండు గలీబులు మార్చాలి వంటగది పూర్తిగా పొడిగా ఉండే లాగా చేయాలి.