మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు మిగతా తినని వాళ్ళతో పోలిస్తే అత్యధిక కాలం జీవిస్తున్నట్లు యునివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన పరిశోధనల్లో తేల్చింది. పూర్వ కాలంలో సుగంధ ద్రవ్యాలని, మిర్చిని కూడా రకరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే వాళ్ళు. ఒక ఇరవై ఏళ్ళ పాటు కొన్ని వందల మంది పైన ఈ పరిశోధన జరిగింది. పండు మిర్చిని తినేవాళ్ళలో రక్త సరఫరా బగునట్టు గుర్తించారు. ఈ కారణం తో నే మిరపపండు భాగంగా తినే వాళ్ళలో ఆకస్మిక మరణాల సంఖ్య తక్కువేనని తేలింది.

Leave a comment