ఇప్పుడు వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు రకరకాల జ్యూస్ ల వైపు చూస్తారు పిల్లలు, పెద్దలు కూడా. కొన్ని జ్యూస్ లు యధావిధి గా తీసుకోవడం కన్నా కొన్నింటితో కలిపి తీసుకుంటే ఆరోగ్య పరంగా లాభం. పుచ్చకాయ రసానికి కీరాదోస, పుదీనా కలిపితే వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. గ్రీన్ టీలో పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు వేగంగా తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. నారింజ లేదా కమలా పండ్ల రసం లో కొంచ నిమ్మరసం కూడా కలిపి తీసుకొంటే గుండెల్లో మంట అనిపించదు. దానిమ్మ అనాస కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్దాలు బయటకు పోతాయి. గ్రీన్ టీ, దాల్చిన చక్క కలిపి తీసుకుంటే శరీరంలో జీవ క్రియల వేగం పెరుగుతుంది. కివి, జమ పండు కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజలని కూడా కలిపి తింటే మంచిది.

Leave a comment