రష్యా కు చెందిన 36 ఏళ్ల యూలియా పెరెస్టిల్ అంతరిక్షంలో తీయబోయే ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.త్వరలో స్పేస్ ఫ్లైట్ లో వెళ్లి నటనలో తన సత్తా చాటనుంది. రష్యా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీయబోతున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇదేమీ చిన్న విషయం కాదు రాకెట్ లో వెళ్లాలి అంతరిక్షంలో ఉండేందుకు ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానంటోంది  యూలియా. నా జీవితంలో ఇదో పెద్ద సవాల్ అంతరిక్షానికి చేసే ప్రయాణం అక్కడ నటించటం సాహసమే ఇందుకు గాను జీరో గ్రావిటీ లో ప్రయాణించటం వంటివి శిక్షణ తీసుకుంటున్న అంటోంది యూలియా తన నటనకు ఎన్నో పురస్కారాలు అందుకుంది యూలియా.

Leave a comment