Categories
బరువుగా ఉన్నామని బెంగ పెట్టుకొంటే లాభం ఏమీ ఉండదు. వదిలించుకొనే ఆరోగ్యవంతమైన మార్గాల వైపు చూడాలి. పగటివేళ ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆరోగ్యవంతమైన పదార్ధాలు కొద్ది కొద్దిగా తినాలి. ప్రతి రోజు కనీసం రెండు సర్వింగ్స్ పళ్ళు, మూడు సర్వింగ్స్ కూరలుగా ఉండాలి. స్థూల కాయ చికిత్స లో అలవేరా శరీరాన్ని నియంత్రించ గలదు. అలాగే ఉసిరి కూర వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాలు పొడి కూడా వేయాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతోంది. కొవ్వు తగ్గిస్తోంది. అలాగే యాపిల్ , వెనిగర్ లు పనికి వస్తాయి. చక్కర, సాఫ్ట్ డ్రింక్స్, కేకులు, బిస్కెట్లు పూర్తిగా వదిలేయాలి. తక్కువ కొవ్వు ఉండే పెరుగు, స్మూదీలు, పండ్లు తింటే చాలు.