ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వల్ల మహిళల పాత్రలు పెరుగుతున్నాయనేది వాస్తవం.ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా మహిళా ఆర్టిస్ట్ లకు మార్కెట్ పెరిగింది.ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఉన్నాయి. షబ్న అజ్మీ, శ్రీ దేవి,స్మితా పాటిల్ వంటి వారు అద్భుతమైన మహిళ చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది అంటోంది రాధిక ఆప్టే నాకు పాత్ర నచ్చితే చాలు అది సినిమానా, స్టేజ్, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్, సింగిల్ ఎపిసోడ్ అన్న తేడా మనసు లోకి రాదు.నేను కనిపించకుండా నా కేరక్టర్ గుర్తించాలి.అది నా కోరిక.షూటింగ్ అయ్యాక నేను వెంటనే దాన్ని మరచిపోతాను ప్రమోషన్లు ఎండోర్స్మెంట్ నావల్ల కాదు అంటుంది రాధిక ఆప్టే. ఆమె నిజంగా తార లోకం లో ఒక సంచలనం.