Categories
కొన్ని కొన్ని వస్తువులకు ప్రత్యేకించి ఎక్స్ పైరీ డేట్ ఉండకపోయినా వాటిని అదేపనిగా సంవత్సరాలపాటు వాడటం క్షేమం కాదు ఉదాహరణకు దిళ్ళు బావుంటాయి చెక్కు చెదరవు. కానీ ఓ మూడేళ్ళు దాటాక వాటిలో డస్ట్ మైన్స్ చేరతాయి. ఎన్నో అలర్జీలు వస్తాయి వీటిని మార్చకపోతే ప్రమాదం.అలాగే దువ్వెనలు కూడా ఓ ఎడాది పాటు వాడాక కొత్తవి కొనుక్కోవాలి ఇక పళ్లు తోముకునే బ్రష్ లు ప్రతి మూడు నెలలకు మార్చాలి.బస్సెల్స్ అడుగుభాగంలో బ్యాక్టీరియా చేరి పళ్లు పుచ్చిపోతాయి.