ఇప్పుడు మా పిల్లలకు నేను వాట్సప్ అమ్మగానే ఉంటున్న వికారాబాద్ లో ఉండి పోయాను కనుక ఇంట్లో పెద్ద వాళ్ళయన మా అమ్మ నాన్నా,ఇద్దరు చిన్న పిల్లల కు వాట్సప్ లోనే రోజు ఏమ్ చేయాలో చెపుతూ ఉంటాను . పిల్లలే మా ఇంట్లో అమ్మమ్మకీ,తాతయ్యకీ సాయం చేయాలని చెపుతాను. కరోనా కేసులు ఎక్కువ కావటంతో నాకు క్షణం తీరిక లేదు అంటున్నారు పౌసమి బసు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న పౌసమి పోలీస్ అధికారులతో కలిసి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వైద్యాధి కారులతో వీడియో కాన్ఫెరెన్స్ లలో బిజీగా ఉన్నారు. రెండు నెలలుగా ఆమె ఇంటికి పిల్లలకు దూరంగా నే ఉన్నారు.