తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్ ని సూపర్ దాదీ అని పిలుస్తారు ఈ గ్రామస్థులు ఆమెకు 84 ఏళ్ళు. కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే మంచిదని వైరస్ ని సమర్థవంతంగా ఎదురు కోవచ్చని టీవీ లో విని ఊర్లో అందరి ఇళ్లలోనూ టమోటా, వంకాయ, బెండ కాయ, పొట్లకాయ, కాకరకాయ, జామ, బొప్పాయి వంటివి నారు పోసి నాటింది వాటిని స్వయంగా సంరక్షించింది. గ్రామస్తులు నిత్యం పొలం పనుల్లో మునిగి తేలుతూ ఇలాంటి పనులు పట్టించుకోరు. కానీ నంజమ్మాళ్ మాత్రం ప్రతిరోజు మొక్కల సంరక్షణ చేస్తూ ఉండటంతో అవన్నీ ఇప్పుడు చక్కగా పెరిగి పెద్దవయ్యాయి గ్రామంలోని వాళ్ళు ఇప్పుడా పెరటి పంటనే వంటకు వాడుతున్నారు. ఇంకా మిగిలిన వాటిని అమ్మి అదనపు ఆదాయం గణిస్తున్నారు కూడా.