టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఆట తో పాటు మాటతోనూ తన ఉనికి చాటుతుంది.యూ ఎస్ ఓపెన్ 2020 విజేతగా నిలిచిన నవోమి టోర్నీ అనంతరం జాతి వివక్ష గురించి మాట్లాడి, ప్రపంచం చూపు తన వైపు తిరిగేలా చేసింది.జాతి వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వార్తల్లో నిలిచిన నవోమి యు ఎస్ ఓపెన్ మ్యాచ్ కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించిన వారి పేరున్న ఏడు మాస్క్ లను ధరించింది.ఈ పని చేయటం ద్వారా నే జాతి వివక్షను అందరు మాట్లాడుకునే లా చేసింది. నవోమి అక్క మారీ కూడా టెన్నిస్ క్రీడాకారిణి ఇద్దరూ డబుల్స్ ఆడతారు.