జీలకర్రలో జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉన్నాయి కొంచెం బ్లాక్ సాల్ట్ నిమ్మరసం, క్లబ్ సోడా కలిపిన జీరా నీళ్లు జీర్ణ సమస్యలను తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి. మూడు స్పూన్ల జీలకర్ర, కొన్ని పుదీనా ఆకులు నిమ్మరసం బ్లాక్ సాల్ట్ చక్కెర లేదా తేనె కొంచెం కారం క్లబ్ సోడా తో ఈ హెల్తీ డ్రింక్ తయారు చేయచ్చు. పుదీనా ఆకులు మెత్తగా నూరాలి, జీలకర్ర పెనం పైన వేయించాలి నీళ్లలో, ఈ పుదీనా గుజ్జు, జీలకర్ర వేసి కాసేపు మరగనివ్వాలి. వడకట్టి బ్లాక్ సాల్ట్ నిమ్మరసం కారం తేనె లేదా పంచదార వేసి కలపాలి. క్లబ్ సోడా లో కలిపి ఐస్ వేస్తే రుచిగా ఉండే జీరా వాటర్ తయారవుతుంది.

Leave a comment