Categories

పెరుగుతో ముఖాన్ని మెరిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. కమలా తొక్కల పొడి లో పెరుగు కలిపి దీనితో ఫేస్ ప్యాక్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే చర్మం చక్కగా ఉంటుంది.టమోటో పెరుగు పూత జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. టమోటో రసం పెరుగు కలిపి మొహానికి మెడకు రాసి పది నిమిషాల తర్వాత కడిగితే మొహం మెరుస్తుంది. రెండు చెంచాల బాదం పప్పు పొడి లో పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఈ ప్యాక్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది.ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉంటే ముఖం చక్కగా ఉంటుంది.