స్నేహ బాంధవ్యం మహిళలను మానసికంగా, శారీరకంగా దృడంగా వుంచగలన్నది శాస్త్రీయంగా రుజువైంది. ఒక మహిళ తాను ఇష్టపడే ఇంకో మహిళ నుంచి ఎంతో మనోధైర్యాన్ని అందుకుంటుంది. వయసు, మతం, కులం, వంటివి స్వచ్ఛమైన స్నేహానికి అడ్డు కావు.మహిళల మధ్య ఉండే ఇంటరాక్షన్ మానసిక పరమైంది. సామాజిక ప్రయోజనాలతో కూడుకుని ఉన్నది ఇలాంటి స్నేహాల వల్ల ఆక్సిటోసిన్, కోపమైన వంటి హార్మోన్లు ఉద్దప్తం అయి మహిళలకు ఆనందం ఇస్తాయి. మగవాళ్లతో పోలిస్తే స్నేహితుల విషయంలో మహిళలు ఆప్యాయత అనురాగాలతో ఉంటారు. సలహాలు, సూచనలు పరస్పరం అందించుకుంటూ సుఖంగా ఉత్సాహంగా ఉంటాదని అధ్యయనాలు చెబుతున్నాయి.