కలర్ ఫోటో సినిమా సక్సెస్ నన్నెంతో ఆనందపెడుతుంది. నాకెరీర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకం… నాకు చాలా ఇష్టమైన పాత్ర లభించింది అంటోంది చాందినీ చౌదరి. నేను చదువుకొనే రోజులలో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇప్పుడు దాన్ని చూస్తే ఇంకా బాగా చేయచ్చు,అనుకొంటాను. కానీ దాన్ని చూసే నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ కార్యరూపంలోకి వచ్చేసరికి చాలా కాలం పట్టింది. హౌరా బ్రిడ్జి సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అంటోంది చాందినీ. ఇన్నేళ్ళ బట్టి నేను గమనించింది ఏమిటంటే తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్ర సీమలో నో ప్లేస్. ఇతర భాషా చిత్రాల్లో పేరు తెచుకొన్నాకే ఇక్కడే చాలా తక్కువ అవకాశాలు వస్తాయి అంటోంది చాందినీ.

Leave a comment