Categories
ఫేషియల్ చేయించుకున్నాక చర్మం చక్కగా మెరుస్తుంది కానీ కొన్ని పొరపాటు చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు ఎక్సపర్ట్స్ .ఫేషియల్ తర్వాత వెంటనే ముఖం కడగకూడదు.నాలుగైదు గంటల తర్వాత నీళ్ళతో కడుక్కుంటే చాలు.ఫేషియల్ తో పాటు ఫేస్ వాక్సింగ్ చేయించుకోకూడదు ఇలా చేస్తే మచ్చలు దద్దుర్లు వస్తాయి. వెంటనే మేకప్ వేసుకోకూడదు చర్మానికి గాలి తగిలేందుకు కొంత సమయం ఇవ్వాలి. అలాగే ఫేషియల్ తరువాత ఒకటి రెండు రోజులు ఫేస్ ప్యాక్ వేసుకోకూడదు. స్కిన్ గ్లో తగ్గుతుంది. ఫేషియల్ వల్ల మొహం మెరిసేందుకు ఒకటి రెండు రోజులు పడుతుంది.