స్కూళ్ళ ఆధునికీకరణ లో భాగంగా గోడలపైన మ్యూరల్స్ వేయటం మాకు దొరికిన ఒక మంచి అవకాశం. 30 అడుగుల ఎత్తైన గోడలు గోడలపైన బొమ్మ గీయడం నాకు చాలెంజ్ ఎప్పుడూ ఆడ పిల్లల బొమ్మలు స్కూలు గోడలపైన గీస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం గోడ పైన 40 అడుగుల గోడ పైన పి.వి సింధు బొమ్మ గీయటం నాకు గొప్ప సంతృప్తి కలిగించింది అంటుంది స్వాతి విజయ్.భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్వాతి విజయ్ గా కార్య చిత్రీకారులు.మేము గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాం. నాడు నేడు కార్యక్రమం లో భాగంగా మాకు ప్రభుత్వ పాఠశాల పైన బొమ్మలు గీసే అవకాశం వచ్చింది. మేము గీసిన బొమ్మలతో పిల్లలు స్కూళ్లకు వచ్చి చదువుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు అంటోంది స్వాతి. ఆమెను దక్షిణ భారత దేశపు తొలి మహిళా మ్యూరల్ ఆర్టిస్ట్ అనవచ్చు.

Leave a comment