నిరంతరం ఏదో పని చేస్తూ సబ్బు వాడుతూ రసాయనాలతో సింక్ లు శుభ్రం చేస్తూ ఉంటే చేతులు చాలా గరుగ్గా ఉంటాయి.చల్లని ఋతువుల్లో మీ చేతులను మరింత పొడిబారి పగుళ్లు కూడా వస్తాయి రెండు స్పూన్ల ఆలీవ్ నూనె లో పంచదార కలిపి అర చేతులకు రాసుకుని బాగా రుద్దాలి .తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అలాగే ఓట్స్ ని కొద్దిగా మెత్తగా పిండిలా అయ్యేలా చేసి ఆ పిండిలో ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి పది నిమిషాలు అలా వదిలేసి చేతులు కడుక్కుంటే మృదువుగా అయిపోతాయి.అరచేతులు బాగా ఎరుపెక్కినా, పగుళ్ళు కనిపించినా వైద్యులను సంప్రదించాలి చేతులు పొడిగా ఉంచుకుని తరచూ కొబ్బరి నూనె రాసుకోవాలి.

Leave a comment