ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,వార్ధక్య లక్షణాలను తగ్గించే శక్తి గల నల్ల నువ్వులు ప్రతి రోజు తినగలిగితే ఫలితం వెంటనే తెలిసిపోతుంది అంటారు.నల్ల నవ్వులు బెల్లం కలిస్తే తిరుగు లేని శక్తి ఇస్తాయి. నల్ల నువ్వులు ,తగినంత బెల్లం ,కాస్త కొబ్బరి కొరు, యాలకుల పొడి ,కొంచెం నెయ్యి చాలు రుచికరమైన లడ్డు చేయవచ్చు. నువ్వులు శుభ్రంగా కడిగి శుభ్రమైన వస్త్రంపై పోసి ఆరనివ్వాలి. పట్టు కొంటే పొడిగా తడిలేకుండా ఉండాలి. అప్పుడు వాటిని వేయించాలి. బెల్లం తురిమి కొంచెం నీరు కలిపి సన్నని సెగ పైన కరిగేలా చేశాక దించేసి నువ్వుల పొడి కొబ్బరి పొడి ,యాలకుల పొడి కలిపి ,ఉండలుగా చేయాలి .ఇవి రోజు కొక్కటి తింటే వెంటవేంటనే శరీరంలో కలిగే మార్పు తెలుస్తుంది.

Leave a comment