తలలో నాలుక లాగా మనుషులు తోటివారితో మెలగాలి అంటారు పెద్దలు.అసలు తలలో నాలుక ఎలా ఉంటుంది శిరస్సులో నాలుక ఒక భాగం.అది చాలా మెత్తగా ఉంటుంది కానీ దాని ముందు ఎంతో కఠినంగా ఉండే 32 పళ్ళు ఉంటాయి.నాలుక ఎటు కదిలిన ఆ పళ్ళ కింద పడిపోయేలా ఉంటుంది. కానీ నాలుక ఎంతో చాకచక్యంగా పళ్ళ మధ్యనే హాయిగా చల్లగా మాట్లాడుతూ ఆహారం స్వీకరిస్తూ ఎన్నో పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుపోతుంది.మనుషుల సమూహంలో జీవించాలి ఎంతో మందితో స్నేహ సంబంధాల తో,వ్యాపార సంబంధాల తో మెలగాలి.నాలుక లాగా ఎవ్వరికీ కష్టం కలిగించకుండా పని చేసుకోవాలి. అందుకే ఈ తలలో నాలుక అన్న పదం వచ్చింది వ్యవహారికం లోకి వచ్చింది.

చేబ్రోలు శ్యామసుందర్  
9849524134

 

Leave a comment