ఏ పండగ వచ్చినా సంప్రదాయపు పరిమళం చుట్టూ ముట్టేస్తూ వుంటుంది. పండగకు అలంకరించుకొనే నగలు ప్రత్యేకంగా వుండాలి కదా. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి వరస పేటలు నగలు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైకి వచ్చాయి. అమ్మాయిలు ఈ లేయర్స్ నగల్ని, నెక్లెస్ లని ఆల్ టైమ్ పర్ ఫెక్ట్ పీసెస్ అని కితాబులు ఇచ్చేస్తున్నారు. గతంలో నాలుగైదు వరసల గొలుసులు ఉండేవి. అవే ఇప్పుడు కష్ట రూపం మార్చుకుని మెడ దగ్గర నుంచి మొదలై వరుసలు వరుసలుగా ఒకే హారంగా అనిపించే లేయర్డ్ నెక్లెస్ లు గొలుసులు ఇవ్వాల్టి ఫ్యాషన్. పెళ్లి కూతుళ్ళు ఇవే బావుంటాయంటార, మోడ్రన్ అమ్మాయిలు ముచ్చట పది కొనుక్కుంటున్నారు. ఈ పొడవైన హారాల కోస్సం ఒన్లిన లో ఇమేజస్ చూడచ్చు.

Leave a comment