వర్షాకాలంలో జుట్టు రాలిపోతుంది . ఈ సీజన్ లో జుట్టు రాలటం 30 శాతం పెరుగుతుందని హెయిర్ స్టయిలిస్థులు చెపుతారు . అప్పుడు ఇన్ ప్లేమేషన్ తగ్గించి హాని జరిగిన జుట్టుకు కుదుళ్ళకు మరమ్మత్తులు చేయాలి . విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడటం కూడా ఒక చక్కని గృహ చికిత్స . ఒక ఉల్లిపాయిని బ్లెండ్ చేసి జ్యూస్ తీసి రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ లోని ఆయిల్ ని ఆ రసంలో కలిపి జుట్టు కుదుళ్ళ నుంచి పట్టించి ఒక అరగంట అలా వదిలేసి తలస్నానం చేయాలి . వాననీళ్ళు జుట్టును బలహీనం చేస్తాయి . శిరోజాలు సహజ నూనెల్ని కోల్పోతాయి . జుట్టు తడవకుండా చూసుకోవడమే మంచి పరిష్కారం కూడా .

Leave a comment