మనసు ఉల్లాసంగా కలిగించటం, దగ్గర నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకూ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది.కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిమళ ద్రవ్యాలను సౌందర్య సాధనాలుగా చికిత్సలు గా ఉపయోగించడం మొదలుపెట్టారు.జలుబు చేస్తే వేడి నీటిలో పసుపు వేపాకు వేసి ఆవిరి పట్టడం,వాముని వేడి చేసి గుడ్డలో వేసి పీల్చటం కూడా పరిమళ చికిత్సలే. జలుబు చేస్తే వేడినీటిలో యూకలిప్టస్ నూనె కలిపి ఆవిరి పట్టచ్చు.తులసి పరిమళం తో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గుతాయి తల నొప్పికి లావెండర్ యూకలిప్టస్నూనెల ఆవిరి పట్టవచ్చు. వీటిలో కొంచెం లావెండర్ లేదా జెరీనియం నూనె కలిపి అందులో పల్చని గుడ్డను తడిపి తల మెడ మై వేసుకున్న నొప్పి తగ్గుతుంది ఒత్తిడి తగ్గేందుకు లావెండర్ గులాబి కెమోమిలే పరిమళాలు ఎంతో ఉపయోగపడతాయి లావెండర్ నూనె నీటిలో కలిపి దిండు పైన చల్లుకుంటే నిద్ర బాగా పడుతుంది.
Categories