Categories
రాగి మాల్ట్ అన్ని వయసుల వారికీ మంచిదే.రాగులను 18 గంటలు నీళ్లలో నాననివ్వాలి నీళ్లను వంపేసి నూలు గుడ్డలో నానిన రాగులను మూటగట్టి పెడితే మొలకలు వస్తాయి. ఇవి ఆరబెట్టి బాగా ఎండిపోయాక మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి ఆ తరువాత పొడిగా చేసుకోవాలి. సువాసనకు యాలుకలు కూడా వేసుకోవచ్చు. గ్లాస్ వేడి నీళ్లు మరగించాలి పొడిగా చేసిన రాగి పిండిని ముందుగా రెండు స్పూన్ల చల్లని నీళ్లలో ఉండలు కట్టకుండా కలిపి మరిగే నీళ్ళలో పోసి ఉడికిస్తే చాలు. ఇలా తయారుచేసిన జావాలో పాలు, బెల్లం లేదా మజ్జిగ ఉప్పు వేసి తాగవచ్చు.మాల్ట్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి.రాగుల్లో తక్కువ కార్బోహైడ్రేడ్లు చక్కెర నిల్వలు, ఎక్కువ పీచు ఉంటాయి.