Categories
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 63 గ్రామీ అవార్డ్ ల నామినీల్లో సంగీత కళాకారిణి అనౌష్కా శంకర్ అర్హత సంపాదించుకొంది. పదో ఏటనే తండ్రి రవిశంకర్ దగ్గర సితార వాయిద్య శిక్షణ తీసుకుంది. అనౌష్కా రచయిత్రి గా ఆమెకు గొప్ప పేరున్నది. తండ్రి జీవిత కథను బాపి – ది లవ్ ఆఫ్ మై లైఫ్ గా రాసి విడుదల చేసింది. లవ్ లెటర్ ఆల్బమ్ తో ది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరి లో స్థానాన్ని దక్కించుకుంది అనౌష్కా. లవ్ లెటర్ ఆల్బమ్ లో ఆరోగ్య సమస్యలు వియోగం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.