ఒక చిన్న అపజయం ఎదురైతే అదే పనిగా కుంగిపోతూ ఇంకే పని ముట్టుకోము,  ఇక మా వల్ల ఏమీ కాదు అని చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఒక్కటే ఉంటుందా జీవితంలో..ఉదాహరణకు స్పిల్ బర్గ్ ని తీసుకుందాం యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో సినిమా కళని అధ్యయనం చేయాలనుకున్నాడు మూడుసార్లు అప్లై చేసిన అవకాశం రాలేదు.అప్పుడిక క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లో ఆంగ్లం లో డిగ్రీ చదివాడు చదువుతూ ఉండగానే యూనివర్సిటీ స్టూడియో లో ఎడిటింగ్ లో జీతం లేని ఉద్యోగం వచ్చింది.అలా షార్ట్ ఫిలిం తీసే అవకాశం వచ్చింది 26 నిమిషాలు 33 ఎం ఎం సినిమా కథ స్వయంగా రాసి తీసి ఆ స్టూడియో వైస్ ప్రెసిడెంట్ సిడ్నీ షైన్ బర్గ్ మెప్పు పొందాడు సిడ్నీ ఆయనకు పదేళ్ల పాటు డైరెక్షన్ ఛాన్సులు ఇచ్చారు.అలా స్టీవెన్ స్పిల్ బర్గ్  నాలుగు దశాబ్దాలు 27 సినిమాలు తీసి మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. అతనే కనుక యూనివర్సిటీ లో సీటు రాలేదని నిరాశ పడి ఫీల్డ్ వదులుకుంటే ఇంత గొప్ప డైరెక్టర్ అయ్యే వాడ ? లక్ష్యం సాధించే వరకు ఓడిపోతున్న శ్రమించే వాడే, నిరంతరం ప్రయత్నించే వాడే విజేత కష్టానిదే గెలుపు.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment