ఆరోగ్యం పట్ల శ్రధ్ధ పెరిగాక మార్కెట్ లోకి కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. తృణ ధాన్యాలతో రంగురంగుల రైస్ బిగ్ బజార్లలో కనిపిస్తున్నాయి. బ్రౌన్ రైస్ ,బ్లాడ్ రైస్ ,రెడ్ రైస్ .ఇలా రకరకాల పేర్లతో అనేక రంగుల్లో కనిపిస్తున్నాయి. అందులో ముదురు రంగులో ఉండే బ్లాక్ రైస్ మంచి పోషకాలున్నాయి. ఈ బియ్యంలోని ఆంథో సైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ గా శరీరంలోని కణజాలాల వాపును నియంత్రిస్తాయి. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి.అధిక కొలెస్ట్రాల్ తో రక్త నాళాలలో ఏర్పడే గడ్డలను తగ్గించి గుండెకు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.ఈ ఆంథో సైనియన్లు డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. కాకపోతే ఈ బియ్యంలో అన్ని బియ్యల్లోలాగే పిండి పదార్థాలు ఉంటాయి.

Leave a comment