Categories
క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటే వీట్ గ్రాస్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాగేందుకు పెద్ద రుచిగా ఉండదు కానీ ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్లు, ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి సమృద్ధిగా ఉండి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తుంది. వరుసగా ప్రతిరోజు నెల రోజులపాటు ఈ జ్యూస్ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చెయ్యటం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది.