Categories
ఎప్పుడో 50 ల్లో 60 ల్లో అమ్మ కట్టిన అందమైన పట్టు చీరలు అంతకంటే ఫ్యాషన్ దుస్తులు గా మార్చేయచ్చు అంటారు ఎక్సపర్ట్స్. హెవీ బనారస్ చీరెను అందమైన సాదా సల్వార్ సూట్ కి మార్చేయవచ్చు. మెరిసే పట్టు ని లెహంగా గా మార్చేసి, దాని పైన తెల్లని షర్ట్ వేస్తే ఫ్యాషన్ లుక్ వచ్చేస్తుంది. చక్కని సిల్క్ చీరె తో ఏ లైన్ లేదా sheath డ్రెస్ కుట్టించుకోవచ్చు చక్కని పట్టు చీరె ఎత్నిక్ జాకెట్ అయిపోవచ్చు. దేశీ లుక్ తో ఉన్న పాత కాలపు పట్టు చీరె వెస్ట్రన్ అవుట్ ఫిట్ గా మార్చచ్చు రెండు అందమైన హెవీ సిల్క్ లు పొడవాటి లాంగ్ కుర్తా అయిపోతుంది.