Categories
ప్రియా బాబు ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ కౌన్సిలర్ అలాగే ట్రాన్స్ న్యూస్ అన్న పత్రిక ఎడిటర్ కూడా ఆరేళ్ల క్రితం ప్రియా ముగ్గురు స్నేహితులతో మధురైలో ట్రాన్స్ జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించారు.గత నవంబర్ 1వ తేదీ నుంచి ట్రాన్స్ న్యూస్ ఆన్ లైన్ పత్రిక కూడా వెలువడింది.ఇప్పటి వరకూ నాలుగు సంచికలు వచ్చాయి .పత్రిక నడిపేందుకు కావలసిన ఫండింగ్‌ను ఇచ్చేందుకు ‘హై–టెక్ అరై’ అనే ఆయిల్ సీల్‌ను ఉత్పత్తి సంస్థ ఇస్తోంది. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లోకి ఈ ట్రాన్స్ న్యూస్ రాబోతుంది.ఈ పత్రిక ట్రాన్స్ జెండర్‌లకు అవసరమైన వ్యాయామం, జ్ఞానం, అనుభవం ఇస్తుంది అంటున్నారు ప్రియా బాబు.