Categories

అనాటమైజ్ 3డి అనే సంస్థ ద్వారా రోగి అవయవాలను పోలిన త్రీడి నమూనాలను రూపొందిస్తోంది ఫిరోజా కొఠారి శస్త్రచికిత్స సమయాన్ని తగ్గించేందుకు త్రీడీ నమూనాలు వైద్యులకు ఎంతో ఉపయోగపడతాయి. బయోటెక్నాలజీ లో ఇంజనీరింగ్ చేసింది ఫిరోజా. వైద్యులతో కలిసి రోగుల అవసరాలకు అనుగుణంగా ఇమ్ ప్లాంట్స్ ప్రస్థటిక్స్ఆర్థోటిక్స్ వంటి వాటిని తయారు చేయిస్తోంది ఫిరోజా. రెండు వందల ఆస్పత్రి లతో కలిసి పనిచేస్తూ వందలాది సర్జరీ లకు కావలసిన నమూనాలను తయారు చేయించింది. గత సంవత్సరం ఫోర్బ్స్ 30 అండర్ 30 విభాగంలో చోటు దక్కించుకుంది ఫిరోజా కొఠారి.