Categories
స్వతంత్ర భావాలు,సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలు కూడా తమ చదువులు ఉద్యోగాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవటం లేదని ఇంట్లో వారో లేదా బాగా స్వామి అనుమతి తీసుకునే ఏ పనైనా మొదలు పెడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది ‘ఒకే క్యూపిడ్’ అన్న డేటింగ్ యాప్ జరిపిన అధ్యయనంలో 79 శాతం మంది మహిళలు ఇప్పటికీ ప్రతి విషయంలోనూ ఇంట్లో వారి అనుమతి తీసుకుంటున్నామని చెబుతున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా కూడా కుటుంబ అనుమతి బట్టే ఉంటుందని 50 శాతం మహిళలు చెప్పారు. 28 శాతం మంది మహిళలు మాత్రమే సొంత నిర్ణయాలతో స్వతంత్రంగా జీవిస్తున్నామని చెప్తారు.