Categories
రాజ్మల్ పూర్ గ్రామానికి చెందిన దినేష్ పాటిల్ షాలూ అనే రోబో ని తయారు చేశారు. ఈయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్. రోబో షాలూ ఏ బాషలో పలకరిస్తే ఆ భాషలో సమాధానం ఇస్తుంది. 47 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది స్కూల్ లో పాఠాలు చెప్పగలదు లేదా ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా పని చేయగలదు ఈ షాలూ తయారీకోసం దినేష్ ఖరీదైన లోహాలను వాడలేదు ప్లాస్టిక్, చెక్క, కార్డ్ బోర్డ్, అల్యూమినియం వంటి వృధా వస్తువులను వినియోగించి తయారు చేశారు.