చెన్నైలోని రాయపేట లో ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్ ప్రారంభమయింది ఈ స్టాల్ భాగస్వాములు ఐదుగురు స్థానికంగా ఉండే వారే. చెన్నైలోని తోళి సంస్థ దగ్గర 2,700 మంది ట్రాన్స్ జెండర్ లా డేటా ఉంది. కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తి గా ఉంటారు అలా కలిసిన ఐదుగురు ట్రాన్స్ ఉమెన్ కోసం త్రీ రోజెస్ సంస్థ షాపును సెటప్ చేసింది. ఈ షాప్ గురించి ఇండియన్ సంస్థ పబ్లిసిటీ ఇచ్చింది.ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవానికి తమిళ చిత్ర దర్శకుడు అరుణ్ కుమార్ సెంథిల్ వచ్చారు గత సంవత్సరం నలుగురు ట్రాన్స్ జెండర్ ల జీవితాలను కలిసి సెంథిల్ కాఫీ కేఫ్ సినిమా తీశాడాయన. ఈ టీ స్టాల్ శుభ్రంగా, గుమగుమలాడే టీ సప్లై చేస్తారని పేరు తెచ్చుకుంటుంది.

Leave a comment