ఇసైవెళ్లాలార్‌కు (దేవదాసి) సంగీత సమాజానికి చెందిన భరత నాట్య కళాకారిణి నృత్య పిళ్లై ఒక తరంలో దేవదాసి మహిళలు దేవాలయాలు, సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. 1920లో దేవదాసి వ్యవస్థ రద్దయిన తర్వాత వీరు నాట్య గురువులు గా స్థిరపడ్డారు నృత్య పిళ్లై తాత రాజారత్నం పిళ్లై ప్రసిద్ధ నాట్య గురువు ఆమె తల్లి తండ్రులు నాట్య గురువు లే నృత్య పిళ్లై పరిధీ లో తన నాట్య ప్రదర్శనలు మొదలుపెట్టారు. భరతనాట్యం పుట్టుకకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ల తో వైభవ వంతమైన దేవదాసి చరిత్రను వివరిస్తూ భరతనాట్యం గురించి ప్రచారం చేయటం మొదలు పెట్టారు. ఈ ప్రదర్శనలతో వంశవృత్తి ఎదుర్కొన్న హేళన లను వేలు చూపిస్తూ నిగ్గదీస్తోంది నృత్య పిళ్లై .