Categories
మెటబాలిజం రేటు ఒక్కొక్కళ్లలో ఒక్కోలా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయే విధానం మెటబాలిజం. ఇది శరీరంలో తక్కువ గా ఉంటే శక్తి కాస్త కొవ్వుగా మారి పేరుకుపోతుంది. మెటబాలిజం క్షీణించకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి డార్క్ చాక్లెట్, అవకాడో, ఆలివ్ ఆయిల్, పీనట్, బటర్, వాల్ నట్స్, చేపలు, సోయా బీన్స్ వంటి వాటిలో ఫ్యాట్స్ ఉంటాయి .ఈ హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో తీసుకుని యూనిమల్ ఫ్యాట్స్ తగ్గించాలి. రోజుకు ప్రతి మూడు గంటలకోసారి స్మాల్ మీల్స్ తీసుకోవాలి అలా అలవాటు అయితే గంటల పాటు కొవ్వు కరుగుతూ ఉంటుంది. కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి ఎనిమిది గంటల నిద్ర పోవాలి డైటింగ్ పేరుతో కేలరీలు తగ్గించరాదు.