
శుభమస్తు పేరుతో ఎన్నో కళ్యాణాలు జరిపించారు మహిళా పూజారి నందిని భౌమిక్ .కల కత్తాకు చెందిన ఈ పూజారి పౌరోహిత్యాన్ని ఎంచుకుని సంస్కృత ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్ దగ్గర అధ్యయనం చేశారు .ఇది గౌరవప్రదమైన వృత్తి. నా కూతురు వివాహం నేను జరిపించినా మొట్ట మొదటి శుభకార్యం నాతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్ళితో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం నాలుగు రకాల వేడుకలు జరిపిస్తున్నాం . పురుషుల స్థానంలో మహిళా పురోహితులను ఎంచుకోవటం కష్టమే కానీ ఇది మంచి ప్రారంభం అనుకుంటున్నాం అంటుంది నందిని భౌమిక్ .