‘వీరాంగనా అన్ వీల్స్’ పేరు తో రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ ను వీరాంగనా లుగా అభినందిస్తూ టూ వీలర్స్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రం లోని 134 స్టేషన్ లలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ కు టూ వీలర్స్ ఇచ్చింది. స్త్రీల రక్షణ కు వీరు తక్షణం హాజరయ్యేలా ఈ టూ వీలర్స్ ఉపయోగపడతాయని ఆ రాష్ట్రంలో స్త్రీలు గుడియా హెల్ప్ లైన్ నంబర్ 1515 కు గానీ ఎమర్జన్సీ రెస్పాన్స్ 112 గానీ సి.ఎం హెల్ప్ లైన్ నెంబర్ 1100 గానీ డయల్ చేస్తే వీరాంగనా లు వెంటనే బయలుదేరి వస్తారని ఆ రాష్ట్ర డిజిపి అంటున్నారు.