ది స్టయిల్ ఎడ్జ్ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ నడుపుతోంది సోషల్ స్టార్ సంతోషి రెడ్డి.డిగ్రీ చదువుతూ ఫ్యాషన్ కు సంబంధించిన విషయాలు ఇంస్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తూ ఉండేది.ఫ్యాషన్ నే కెరీర్ గా ఎంచుకుంది. 2016 లో కాస్మోపాలిటన్ బ్లాగర్ గాను ఎలె బ్లాగర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది .2017 లో పల్లడియం స్పాట్ లైట్ బ్లాగర్ గా పేరు తెచ్చుకుంది.సోషల్ మీడియా స్టార్ గా అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ లలో పది లక్షల మంది ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది 27 ఏళ్ల సంతోషి.