Categories
క్యాబేజీ కూర వండుకుంటాం కానీ అందాల పూల తోటలుగా పెంచటం ఎక్కడైనా ఉంటుందా ? ఆర్నమెంటల్ క్యాబేజిలు చూస్తే తోట అలంకరణకు ఇంత కంటే మంచి పూవులు ఇంకెక్కడా లేవనిపిస్తుంది. ఈ అందమైన క్యాబేజిపూవులు గులాబీ,పీచు,వంగపూవు ఇలా విభిన్నమైన రంగుల్లో మిశ్రమ వర్ణాల్లో కనువిందు చేస్తాయి. మాములు క్యాబేజీలో చుట్టు కొన్ని ఆకులు విచుకొన్నట్లు మధ్యలో బంతిలాంటి క్యాబేజీ ఉంటుంది కదా. ఆ బంతి బదులుగా గులాబీలా రెక్కలు విచ్చుకొంటాయి.చల్లని ఈ క్యాబేజీ పూవులు రంగులు ముదురు వర్ణం లోకి మారుతూ మనోహరంగా దర్శనం ఇస్తాయి. తోటకు అందం వచ్చేలా వంగపూవు రంగు,గోధుమ,గులాబీ రంగుక్యాబేజీలు వరుసగా వేసి వాటి చుట్టు ఆకుపచ్చని చెట్లు పెంచుతూ తోటను ముస్తాబు చేస్తారు. పూవు పుసిందంటే రెండు,మూడు నెలలపాటు వాడకుండా తాజాగా ఉంటాయి.ఈ పూవుల్లో చిన్న సైజువి బుకే లు, ఫ్లవర్ వేజుల్లో ఉపయోగిస్తారు ఈ అలంకరణ క్యాబేజిలు కొన్ని ముద్దగా పూవు పూసినట్లు ఉంటే మరికొన్నింటి కొసలు వంకర టింకరగా చిత్రంగా ఉంటాయి. కొన్నింటి మధ్యలో నిండు రంగులు పూవు ఉండి చుట్టు ఆకుపచ్చని ఆకులతో చాలా అందంగా ఉంటాయి. ఇంత అందమైన క్యాబేజీలను చూస్తే ఇన్నీ వర్గాల సమ్మెళనం ప్రకృతి విచిత్రం కదా అనిపిస్తుంది.