Categories
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే సీజనల్ ఫుడ్ తీసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ కాలంలో దొరికే మొక్కజొన్న లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్క్ లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పాటు ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు అరటి పండు తినాలి. కండరాలు శక్తి కోసం కోడిగుడ్లు తీసుకోవాలి. బొప్పాయి దానిమ్మ పియర్స్ లిచి వంటి సీజనల్ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాలి శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేందుకు సహాయపడే ఎలక్ట్రోలైట్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి పోషకాలు అందుతాయి.