Categories
వ్యాక్సిన్ బాటిల్స్ తో తయారు చేసిన షాండిలియర్, లైట్ ఆఫ్ అప్రిసియేషన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొలరాడో కు చెందిన లారా వీస్ బౌల్డర్ లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన ఒక నర్స్ కరోనా క్రమంలో వ్యాక్సిన్ చేసేందుకు ఆమెను తిరిగి విధుల్లోకి ఆహ్వానించారు. ఏడు నెలలుగా తన సహ ఉద్యోగులతో కలిసి వ్యాక్సిన్ వేస్తోందామె అట్లా వచ్చిన కాళీ వ్యాక్సిన్ బాటిల్లతో అందమైన షాండ్లియర్ తయారు చేశారు. దాన్ని లైట్ ఆఫ్ అప్రిసియేషన్ పేరుతో హెల్త్ కమ్యూనిటీ లో షేర్ చేస్తే అది కాస్త వైరల్ అయింది. ఈ షాండ్లియర్ కోసం 300 మోడ్రన్ వ్యాక్సిన్ సీసాలు అడుగు భాగంలో అలంకరణ కోసం పది జాన్సన్ అండ్ జాన్సన్ బాటిళ్ళు వాడారు.