Categories
గ్రీన్ కాఫీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే క్లోరో జెనిక్ యాసిడ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ కాఫీ కోసం పూర్తిగా పచ్చగా ఉండే కాఫీ గింజలను తీసుకొని వేయించకుండా పొడి చేస్తారు. అయితే ఈ కాఫీ మామూలు కాఫీ రుచి ఉండదు. హెర్బల్ టీ లాగా ఉంటుంది కాఫీ విత్తనాల మూలాలు ఒకటే అయినా ఈ గ్రీన్ కాఫీ గింజల్లోని రసాయన పరిమాణాలు భిన్నంగా ఉంటాయి. గ్రీన్ కాఫీ లోని క్లోరో జెనిక్ యాసిడ్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైనా మధుమేహ హుద్రోగాలు అదుపు చేస్తుంది.