కొంచెం బరువు పెరగ్గానే హీరోయిన్స్ పైన ఎన్నో జోకులు వచ్చేస్తాయి. డర్టీ పిక్చర్ తర్వాత బొద్దుగా తయారైన విద్యాబాలన్ కూడా ఈ బాడీ షేమింగ్ ను ఎదుర్కొనక తప్పలేదు. కానీ తనపై వచ్చిన కామెంట్లను అస్సలు కేర్ చేయనంటోంది విద్య. నా వంటి తీరు గురించి నేనెవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు. నటించే పాత్రల్లో నేను కనిపించను కనుకే బేగం జాన్ కు అంత రెస్పాన్స్ వచ్చింది. బేగం జాన్ తో ప్రతి మహిళా తనను తాను పోల్చుకొంటోంది. స్త్రీల జీవితంలో ఏదో సందర్భంలో బేగం జాన్ ఎదుర్కొన్న సంఘటనలు ఎదుర్కొనే ఉంటారు. ఆ ఎక్స్ ప్లాయిటేషన్ శరీరానికి సంబందించినదే కానక్కర్లేదు. అది ఏ రకంగా వున్నా సరే స్త్రీలు బేగం జాన్ లా ఎదుర్కోవాలి. నా శరీరం గురించి వచ్చే కామెంట్స్ విషయంలోనూ నేను బేగం జాన్ లాగే ఎదుర్కోగలను. నేను నా శరీరాన్ని ప్రేమిస్తాను. నేను వేసుకునే దుస్తులు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మనం అందరినీ ప్లీజ్ చేసేందుకు సమాధానాలు ఇస్తూ తలోంచేందుకు పుట్టలేదు. మనం మన కోసమే ఆనందంగా వుండాలంటుంది విద్య. బేగం జాన్ సక్సెస్ తో తన పైన తనకింకా నమ్మకం పెరిగిందంటుందామె.
Categories