నీహారికా,
సంతోషానికి అతిగా స్పందించడం, విచారానికి అతిగా కుంగిపోవడం కూడా ఒక దురలవాటు వంటిదే. మనకు ఎలాంటి ఇబ్బందులున్నా దీన్ని నవ్వే పెదవి వెనక అణిచి పెట్టి ఓ చిరునవ్వు ఎదుటి వారి కోసం ఇమ్మన్నాడో సినిమాకవి అసలు మన చుట్టూ వున్న వాళ్ళని ఒక నవ్వుతో పలకరించడం వాతావరణాన్నే సానుకూలంగా మార్చేస్తుంది. మన సమస్యలు, చిరాకులు అవతల పెట్టి చేతనైనంత లో ఎదుటి వాళ్ళకు ఎప్పుడూ ఓ చిన్న సాయం చేసేందుకు ముందుకే వుండాలి. అలా సయం పొందిన వాళ్ళు ఓ ధాంక్స్ చెప్పినా చాలు మాన మనసంతా సంతోషంతో నిండిపోతుంది.ప్రతికూలమైన ఆలోచనలు మనసు నిండా నింపుకుంటే అవే మనల్ని కుంగదీస్తు ఒక్క అడుగు ముందుకు పదనీయవు. అందుకే సానుకూల దృక్పదం అలవరుచుకోవాలి. అప్పుడు ప్రతి విషయంలో మనకి ఆనందమే దొరుకుతుంది. ఒక వేళ విచారం కలిగినా అది మనస్సు పైన ఎంతో సేపు నిలబడదు. అలాగే ఆనందం కూడా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయదూ. మనస్సు ఆనంద విచారాలని ఒకేరకం గా తీసుకునే నిబ్బదం తో వుంటుంది. ఇందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.