ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కమల్  రణదివే. క్యాన్సర్ కు వైరస్ కు మధ్య ఉన్న సంబంధాలు మొట్ట మొదట గుర్తించిన బయో మెడికల్ రీసెర్చ్. మహారాష్ట్ర లోని పూణే లో జన్మించిన కమల్ రణదివే వృక్ష జంతుశాస్త్రాలు చదువుకొన్నారు. పూణే లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెసి పూర్తి చేశారు నైటో జెనిటిక్స్ లో ఉన్నత విద్య అభ్యసించిన కమల్ జెటి రణదివే ను పెళ్ళి చేసుకొన్నారు. బాంబే యూనివర్సిటీ నుంచి పి హెచ్ డీ అందుకొని,బాల్జీమోర్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డాక్టరేట్ ఫిలోసిపి  పొందారు. ఇండియాకు తిరిగి వచ్చి ఇండియన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ లో చేశారు. లుకేమికా,గొంతు కాన్సర్ కణాలను గుర్తించటంలో కీలకపాత్ర పోషించారు. బాక్టీరియా పై కమల్ చేసిన పరిశోధనలు ఆధారంగా కుష్టు వ్యాధికి టీకా తయారు చేసేందుకు వీలైంది.

Leave a comment