Categories
ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాను. తండ్రి తో ఆమెను దూరం పెట్టనే లేదు అంటుంది నీనా గుప్తా. మాసాబ్ గుప్తా ఆమె ఏకైక కుమార్తె ఇద్దరు కలిసి నటించిన మసాబా మసాబా వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా ఓటీటీ లో ఎందరో అభిమానం పొందింది. అందులో నిజజీవిత పాత్రలనే పోషించారు తల్లీకూతుళ్ళు. నీనా గుప్తా జీవితం గొప్ప సంచలనం. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ తో పెళ్లి కాకుండా మసాబా కు జన్మ ఇచ్చి సింగిల్ పేరెంట్ గానే ఆమెను పెంచింది నీనా గుప్తా.