Categories

గర్భనిరోధక మాత్రల వాడకం కొంత తెలుసుకునీ వాటి పనితీరు గురించి విచక్షణ మహిళల్లో ఉండటం లేదు అంటున్నారు డాక్టర్లు. ఐ పిల్ వంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ను గర్భనిరోధక పద్ధతులు అవలంభిస్తూ పొరపాటున మరిచి పోయిన సందర్భం లో వాడుకోవాలి కానీ ఈ పిల్స్ నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పడం అబార్షన్ గర్భం దాల్చ లేకపోవటం వంటివి జరుగుతాయి. ఒకవేళ అప్పటికే గర్భం ధరించి వుండి ఈ పిల్ వాడితే దాని ప్రభావం పిండంపై ఉండి జన్యు పరమైన సమస్యలతో బిడ్డ పుట్టే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. పైగా ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ను 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే వాడాలి.